Nalgonda : 26న ప్రారంభమయ్యే పథకాలు వారికి అస్సలు ఇవ్వొద్దు..!
Nalgonda : 26న ప్రారంభమయ్యే పథకాలు వారికి అస్సలు ఇవ్వొద్దు..!
నల్లగొండ, మన సాక్షి :
సేద్యానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద 12000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉదయ్ ఆదిత్య భవన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, శాసన సభ్యులతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా శాసన మండలి చైర్మన్ మాట్లాడుతూ భూమి లేకుండా చాలా మందికి పాస్ బుక్ లు మంజూరు చేసారని వాటిని అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి వారికి రైతు భరోసా నుండి తొలగించాలని అధికారులకి సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమిలేని కూలీలకి సంవత్సరానికి 12000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని లబ్దిదారులని జాగ్రత్తగా గుర్తించాలని, తలసరి ఆదాయం లో సిక్కిం తర్వాత తెలంగాణ నే ముందంజలో ఉంది కానీ రేషన్ కార్డు దరఖాస్తులు చాలా వచ్చాయని వాటిని క్షేత్ర స్థాయి లో పరిశీలిస్తూ అర్హులకి మాత్రమే నూతన కార్డులు జారీ చేయాలని అధికారులకి సూచించారు.
రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం లో పేదల సంక్షేమం, అభివృద్ధి చేయటమే మొదటి ధ్యేయం అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం లో ప్రజల వద్దకే పాలన తీసుకొచామని అధికారులు విధులని భాద్యత తో నిర్వహించాలని సూచించారు. గత ప్రభుత్వం పదేళ్ళ కాలంలో నల్గొండ నియోజకవర్గం లో 797 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులకి ఇవ్వలేదని కానీ ఈ ప్రజా ప్రభుత్వం లో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసి పేద వారి ఇంటి కల నెరవేరుస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించి మంజూరు చేయాలని అధికారులకి సూచించారు.
ఆర్థికవేత్త,స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ఆలోచనతో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద రెండు విడతలలో 12000 ఇస్తామని తెలిపారు.ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు కలెక్టర్లు బాగా పనిచేస్తారని వారికి అధికారులు సహకరించి పేదల సంక్షేమం కోసం ఏ ఒక్క అర్హుని వదలకుండా అన్ని పథకాలు అందేలా చూడాలని అలాగే నల్గొండ జిల్లాని ప్రధమ స్థానం లో ఉండేలా చూడాలని సూచించారు.
తదుపరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో ఒక్క సంవత్సరం కాలంలోనే 40 వేల కోట్ల రూపాయాలతో రైతు సంక్షేమం చేపట్టడం జరిగిందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రణాళిక బద్దంగా ప్రజలకు మాట ఇచ్చినందుకు మహాలక్ష్మి పథకం , రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ,500 రూపాయలకె గ్యాస్ లాంటి పథకాలు అమలు చేశామని 75 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు లాంటి పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు.
అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ జనవరి 16 నుండి 20 వ తారీఖు వరకు రెవిన్యూ గ్రామాల వారీగా రికార్డులు పరిశీలించి జనవరి 21 నుండి 24 వ తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు నిర్వహించి భూమి లేని వారిని, భూ సేకరణ చేసిన భూములని, గుట్టలను, లే అవుట్ లని,నాలా కన్ వర్శన్ చేసిన భూములను గుర్తించి వారి పేర్లను రైతు భరోసా పథకం నుండి తొలగించాలని ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలున్న రైతులకి రైతు భరోసా ఇవ్వాలని అధికారులకి సూచించారు. ఏ ఒక్క అనర్హలకి రైతు భరోసా ఇవ్వకుండా అధికారులు శ్రద్ద తో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే అత్యవసరం ఉన్న వారిని గుర్తించి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తదుపరి మిగిలిన వారికి వచ్చే సంవత్సరం మరి కొంత మందికి మంజూరు చేయాలని ఇలా నాలుగు సంవత్సరాలలో అందరికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కి ఎక్కువ ఇండ్లు వచ్చేలా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రయత్నిస్తామన్నారు.సంక్షేమ పథకాలు పెదాలకి అందేలా అధికారులు నిబద్దతతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు.
తదుపరి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అడిగిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై సందేహాలను మంత్రులు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,శాసన సభ్యులు బాలు నాయక్, నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్,జై వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంతరావు, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డివోలు, తహసీల్దార్ లు,వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం..!
-
Additional collector : కొత్త పథకాల ఎంపికకు ఇవీ మార్గదర్శకాలు.. అదనపు కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : వారికి రైతు భరోసా ఇవ్వొద్దు.. సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..!









