Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవిద్య

Holidays : సంక్రాంతి హాలిడేస్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం..!

Holidays : సంక్రాంతి హాలిడేస్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

సంక్రాంతి పండుగ హాలిడేస్ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా విద్యార్థుల వివిధ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకే కాకుండా కళాశాలలో కూడా సెలవు ప్రకటించింది. జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలకు 6 రోజులపాటు సెలవు ప్రకటించింది. 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లుగా తెలంగాణ స్టేట్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రకటించింది.

జనవరి 17వ తేదీన కళాశాలలో ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, కోఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బిసి వెల్ఫేర్, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలతో సహా అన్ని కాలేజీలకు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు రోజుల్లో స్కూల్లో జూనియర్ కళాశాలలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ పేర్కొన్నది.

MOST READ :

—————————-

మరిన్ని వార్తలు