డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో అవకతవకలు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో అవకతవకలు
తహశీల్దార్ కు పిర్యాదు చేసిన వార్డు సభ్యులు
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మన సాక్షి:
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ 7 గురు వార్డు సభ్యులు తాహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.
ఇట్టి విషయంపై గ్రామసభలో గురువారం రోజు చర్చ జరగగా తహసీల్దార్ ఇచ్చిన లిస్ట్ ప్రకారమే అర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూములు కేటాయించడమైనదని సర్పంచ్ అనసూయ వెంకట నరసింహారెడ్డి అన్నారని, వార్డు సభ్యులు తెలిపారు.
ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
కానీ తీరా తహసిల్దార్ ఆఫీస్ కు వచ్చి వార్డు సభ్యులు ఆరా తీయగా,అసలు ఆ డబుల్ బెడ్ రూమ్ ల విషయమే నాకు తెలియదు అంటూ తహసిల్దార్ జవాబిచ్చారు.
ఈ విషయంపై ఒకింత అసహనానికి గురైన వార్డు సభ్యులు,అసలు గ్రామ సభ నిర్వహించకుండా అర్హులను వదిలి అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఏకపక్ష నిర్ణయంతో సర్పంచ్ ఎలా కేటాయిస్తారు అంటూ 7గురు వార్డు సభ్యులు ప్రశ్నించారు.
ఈ విషయంపై తగుచర్యలు తీసుకుని అర్హులకు మాత్రమే న్యాయం చేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!









