TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu : రైతులకు డబుల్ బొనాంజ.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

Rythu : రైతులకు డబుల్ బొనాంజ.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేసింది. రైతులకు డబుల్ బోనాంజ అందజేయనున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న రైతుబంధు పథకాన్ని అమలు చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు.

రైతు భరోసా పథకం ఆలస్యమైనప్పటికీ డబుల్ బోనాంజ అందించనున్నారు. సంక్రాంతి పండుగ ముందే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15వేల రూపాయలను ప్రభుత్వం అందించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా సంక్రాంతి పండుగకు ఒక విడత ఎకరానికి 7500 రైతుల ఖాతాలలో జమ చేయనున్నది. అదే విధంగా రైతులకు బోనస్ అందజేయనున్నది.

సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ అందజేస్తుంది. ఒక్క ఎకరం ఉన్న రైతుకు సుమారుగా 15 వేల రూపాయల బోనస్ అందుతుంది. కాగా ఒక సీజన్ కు గాను రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఎకరానికి రైతు భరోసా బోనస్ తో కలిపి 20,000 నుంచి 22, 500 రూపాయల వరకు ప్రభుత్వం అందజేస్తుంది.

సన్నధాన్యం పండించే రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త కూడా తెలియజేసింది. వానాకాలం, యాసంగి సీజన్ లో కూడా సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ నాటికి రైతులకు రైతు భరోసాతో పాటు బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ కానున్నది.

MOST READ : 

మరిన్ని వార్తలు