Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా రూ.7500.. వారికి మాత్రమే, లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా రూ.7500.. వారికి మాత్రమే, లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన నిధుల సమీకరణ కూడా చేపడుతుంది. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి నేరుగా రైతు ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నది.

గత ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఉన్న భూములకు కూడా రైతుబంధు పథకాన్ని అందజేశారు. దాంతో నిధుల దుర్వినియోగం అయింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి 15వేల రూపాయలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రైతుబంధు పథకంలో ఉన్న అక్రమాలను తొలగించి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.

అందుకు గాను క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా రైతుల అభిప్రాయ సేకరణ చేశారు. అందుకు గాను వానాకాలం రైతు భరోసా ఆలస్యమైంది. అయితే సంక్రాంతి నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరానికి ఒక విడత 7500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే రైతుల అభిప్రాయ సేకరణలో భాగంగా కేవలం పంటలు సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఈ ఏడాది 52 లక్షల ఎకరాలు సాగయింది. సాగు చేసిన పంట భూములకే రైతు భరోసా ద్వారా రైతులకు పంటల పెట్టుబడి సహాయాన్ని అందజేయనున్నారు.

అదేవిధంగా 7.20 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇన్కమ్ టాక్స్ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు భరోసా కట్ చేయనున్నారు. కేవలం 7.20 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే సాగు చేసుకున్న వారికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు