తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : సాగునీరు అందక ఎండిన పంట పొలాలు.. పరిశీలించిన మాజీ మంత్రి..! 

Suryapet : సాగునీరు అందక ఎండిన పంట పొలాలు.. పరిశీలించిన మాజీ మంత్రి..! 

పెన్ పహాడ్, మన సాక్షి :

కాంగ్రెస్ అవగాహన రాయిత్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంత కండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. పెన్ పహాడ్ మండలంలోని మంగళవారం మేఘ్య తండా, దుబ్బ తండ లలో ఎండిపోయిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు.

సాగునీరు అందక పచ్చని పంట పొలాలు కండ్లముందే ఎండిపోయి రైతన్న తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతున్నదన్నారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్ళు లేక పొలాలు ఎండుతున్నాయని, పశువులకు మేతగా మారుతున్నాయని, రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారన్నారు.  కండ్ల ముందే ఎండిపోతున్న పంట పొలాలను రైతులు చూసి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.

బి ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో పాడి పంటలతో సంతోషంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ పంటలను తామే కాల్చుకునే పరిస్థితులు, పశువులను మేకలను మేపుకునే పరిస్థితి నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జరుగుతున్న శాసనసభ సమావేశాలలో నేను రైతుల, మహిళల, వృద్ధుల, పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లనే సస్పెన్షన్ చేశారని ప్రజలకు తెలిపినారు, ప్రజలు ముక్కుమ్మడిగా మహిళా రైతులు జగదీష్ రెడ్డి చుట్టుముట్టి గత బిఆర్ఎస్ పరిపాలనలో పుష్కలంగా నీరు వచ్చి పంటలు పండినాయని ,ఇప్పుడు నీరు రాక పంటలు పూర్తిస్థాయిలో ఎండిపోయినాయని ,జగదీష్ రెడ్డికి వివరించినారు. రైతుబంధు రావడం లేదు, రైతు రుణమాఫీ కాలేదు అని మహిళా రైతులు ఆవేదనతో మాజీ మంత్రికి తెలిపినారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, జానకి రామ్ రెడ్డి, తెలంగాణ వికాసంతి జిల్లా అధ్యక్షులు బిట్టు నాగేశ్వరరావు, జిల్లా నాయకులు గోపగాని వెంకట నారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్, పుట్ట కిషోర్, జీడి బిక్షం, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, జేతు నాయక్, నెమ్మాది కృష్ణ, లక్ష్మణ్, కొండేటి సుధాకర్, షేక్ షరీఫుద్దీన్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  2. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

  3. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  4. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు