TOP STORIESBreaking Newsfood

Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, ఫీచర్స్ డెస్క్:

వేసవి కాలంలో నిత్యం పెరుగు అన్నం తీసుకోవడం శ్రేయస్కరమేనా? నిజానికి, రోజూ పెరుగన్నం తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగన్నంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల, కణాల నిర్మాణానికి ఎంతో సహకరిస్తుంది. ఇందులో కాల్షియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.

అంతేకాకుండా, ప్రతిరోజూ పెరుగు అన్నం భుజించడం వల్ల శరీరానికి ఫాస్ఫరస్, విటమిన్ బి12, ప్రోబయోటిక్స్, రిబోఫ్లావిన్ పుష్కలంగా అందుతాయి. కాబట్టి, నిత్యం భుజించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా, వేసవి కాలంలో పెరుగన్నం తింటే అనేక లాభాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

వేసవిలో నిత్యం పెరుగన్నం తింటే :

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పెరుగు అన్నంలో ప్రోబయోటిక్స్ అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. మలబద్ధకం సమస్యను నివారించడానికి తోడ్పడుతుంది. తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి పెరుగు అన్నం ఎంతగానో ఉపకరిస్తుంది.

శరీరానికి చల్లదనం చేకూరుస్తుంది: పెరుగు అన్నం నిత్యం భుజించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి ఎంతో సహకరిస్తుంది. తరచుగా సీజనల్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది.

కాల్షియం సమృద్ధిగా ఉంటుంది: పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలతో పాటు దంతాలను ఆరోగ్యవంతంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా తరచుగా వచ్చే ఎముకల సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా, ఇందులో లభించే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఎంతో సహకరిస్తాయి.

ఒత్తిడి తగ్గుతుంది: కొన్ని అధ్యయనాల ప్రకారం, పెరుగు అన్నం నిత్యం భుజించడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ అన్నం భుజిస్తే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇవే కాకుండా, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Reporting : Santhosh, Hyderabad 

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

  2. MS Dhoni: మళ్లీ ధోనినే.. వారికి బ్రాండ్ అంబాసిడర్‌‌ ఆయనే..!

  3. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

  4. Hyderabad : వారికి ఊరే సరి.. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

  5. DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!

మరిన్ని వార్తలు