foodBreaking Newsతెలంగాణ

Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!

Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!

హెల్త్ , మన సాక్షి ఫీచర్స్ :

మధ్యాహ్న భోజనం మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రధాన భోజన సమయం. కానీ కొన్ని ఆహారాలను ఈ సమయంలో తింటే బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మందగించడానికి శరీరానికి అనవసరమైన కొవ్వు చేరడానికి కారణమవుతుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో కొన్ని ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. అవేంటంటే..

వైట్ బ్రెడ్ సాండ్విచ్:

దీనిలో అధికంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెంచి కొంతసేపటి తర్వాత తిరిగి ఆకలిని పెంచేస్తాయి.
దాంతో బరువు ఈజీగా పెరిగిపోతారు.

పాస్తా:

అధిక క్రీమ్ కలిగిన పాస్తా మధ్యాహ్న భోజనం ముందు తినకూడదు. పాస్తాలో అధిక క్యాలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. తద్వారా జీర్ణక్రియ మందగించి అలసట వస్తుంది. లంచ్‌లో తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

డ్రింక్స్:

కొన్ని డ్రింక్స్‌లో అధికంగా చక్కెర ఉంటుంది.
షుగర్ ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను మధ్యాహ్నం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీని ప్రభావం బరువుపై పడటమే కాకుండా డయాబెటిస్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

ఫాస్ట్ ఫుడ్:

బర్గర్, ఫ్రైస్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇవి అధికంగా కొవ్వు, ఉప్పు కలిగి ఉంటాయి.
ఇవి శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేసి కడుపు పగిలినట్టుగా అనిపించేలా చేస్తాయి.
అదే సమయంలో కొవ్వు పేరుకుని బరువు పెరగడానికి కారణమవుతాయి.

చీజ్:

చీజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను మధ్యాహ్నం తినడం మంచిది కాదు. చీజ్‌లో అధిక కొవ్వు ఉండటం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే కొవ్వు నిల్వ ఉండటంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసం:

ప్రాసెస్ చేసిన మాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ఉప్పు కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్న భోజనం శరీరానికి శక్తిని అందించాలి కానీ బరువు పెరగడానికి కారణం కాకూడదు. అందుకే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకర జీవితం కోసం ఇవి తప్పనిసరి.

Reporting :

B.Santhosh, Hyderabad 

MOST READ : 

  1. Health : ఆటిసం.. చిన్నారుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పుస్తకం..!
  2. Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!
  3. Headache: టీ, కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందా.. నిజమిదే..!
  4. Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

మరిన్ని వార్తలు