Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కు ఈడి భారీ షాక్.. రూ. 800 కోట్ల ఆస్తులు అటాచ్..!
Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కు ఈడి భారీ షాక్.. రూ. 800 కోట్ల ఆస్తులు అటాచ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సుమారు 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ సంఘటన సంచలనం కలిగిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక్కసారిగా దూకుడు చూపిస్తుంది.
12 సంవత్సరాల క్రితం నాటి క్విడ్ ప్రో కేసులో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన దాల్మియా సిమెంట్స్ కేసులో ఇప్పుడు ఈడి ఆస్తులు అటాచ్ చేసింది. జగన్ కు సంబంధించిన 27.5 కోట్ల షేర్లను జప్తు చేశారు. సుమారు 800 కోట్ల రూపాయల దాల్మియా సిమెంట్ ఆస్తులను ఈడి జప్తు చేసింది
కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులు ఇచ్చినందుకు కాను జగన్ పెట్టిన కంపెనీలో నిధులు మళ్లించి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఈడి ప్రధాన అభియోగం. 2013లో దాల్మియా సిమెంట్స్ పై ఈడి చార్జి సీటు దాఖలు చేసింది. దానిని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని సిమెంట్ కంపెనీ ఆశ్రయించింది. కాగా సుదీర్ఘ విచారణ తర్వాత లీగల్ అడ్డంకులు తొలగిపోవడంతో ఆస్తులను ఈడి జప్తు చేసింది.
MOST READ :
-
TG News : మూడు నెలలుగా జీతాలేవీ.. బతికేదెట్లా..!
-
USFDA: ఆ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. మందుల తయారీకి గ్రీన్ సిగ్నల్..!
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
TATA: టాటా స్టీల్ మరో ఘనత.. FY 25లో భారీగా ఉత్పత్తులు, విక్రయాలు..!









