TG News : మూడు నెలలుగా జీతాలేవీ.. బతికేదెట్లా..!
TG News : మూడు నెలలుగా జీతాలేవీ.. బతికేదెట్లా..!
పెన్ పహాడ్, మన సాక్షి:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బందికి, ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. వివరాలలోకి వెళితే.. రాష్ట్రంలోనూ వివిధ మండలాలలోనూ పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదు, నెల జీతం నాలుగు రోజులు ఆలస్యమైనా బతుకు బండి గాడి తప్పే ఈ రోజుల్లో ప్రభుత్వ విధుల్లో ఉన్న 14వేల మంది మూడు నెలలుగా వేతనాలు లేక విలవిలలాడుతున్నారు.
వేతనాలకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్న సాంకేతిక సమస్య కారణంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది. ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు.
వీరిలో 3800 మంది ఫిక్స్డ్ టైంన్ వర్క్ ఉద్యోగులు,( టి ఏ లు, ఏపీవోలు, ఈసీలు, సి ఓ లు) 2000 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తో పాటు, మండల, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ( డి ఆర్ డి ఓ లు, అదనపు పీడీలు, ఏపీ డీలు, హెడ్ ఆఫీస్ లో పనిచేసే సి ఎఫ్ ఓ లు, ఈసీలు , వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇప్పటికైనా తమకు వేతనాలు అందించి మమ్ములను ఆదుకోవాలని ఉపాధి హామీ ఉద్యోగులు సిబ్బంది వేడుకుంటున్నారు.
కొద్దిపాటి వివేతనంతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు జీవనం గడవక కుటుంబ పోషణ బరువై అనేక బాధలకు గురవుతున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చినారు. విధులు నిర్వహిస్తున్నప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడానికి తంటాలు పడవలసి వస్తుందని, మూడు నెలలు పెండింగ్ వేతనాలు అందించాలని వారు ఉన్నంత స్థాయి అధికారులను వేడుకుంటున్నారు.
Reporting : NageshwarRao, Penpahad (suryapet)
MOST READ :
-
బతికుండగానే చంపేశారు.. సారూ.. ఇంకా నేను చనిపోలేదు..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!
-
DMHO : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. రికార్డులను పరిశీలించిన DMHO..!
-
District collector : యువతకి చాలా భవిష్యత్తు ఉంది.. మత్తుకు బానిస కావొద్దు.. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి..!
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
-
Liquor : మద్యం ప్రియులకు భారీ షాక్..!
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!









