తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరికి సహకరించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మార్కెట్ యార్డులోని ఐకెపి సెంటర్లలో ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలన్నారు.
మార్కెట్ యార్డులో నూతన గోదాముల ఏర్పాటుపై చర్చించారు. అదేవిధంగా ప్రతి శనివారం, మంగళవారం నిర్వహించే సంతకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయనతో పాటు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఉన్నారు.
MOST READ :
-
Miryalaguda : మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఇక డే బై డే సమీక్ష..!
-
District collector : యువతకి చాలా భవిష్యత్తు ఉంది.. మత్తుకు బానిస కావొద్దు.. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి..!
-
Nalgonda : ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం..!
-
Tahsildar : ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!










