Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం..!

Nalgonda : ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం..!

నల్లగొండ, మన సాక్షి :

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి అక్రమంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై చార్జ్ షీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ లోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈడి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఈడి ఎసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని
కాంగ్రెస్, పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు.

పార్టీని బలహీనపరచడానికి బిజెపి కుట్రలు చేస్తుందని
కేంద్రంలో బిజెపి అరాచక పాలన సాగిస్తుందని, బిజెపి ప్రభుత్వంలో దేశ సంపదంత సంపన్నులు దోచుకుంటున్నారు అని విమర్శించారు. దేశంలో కులదరణ చేసి వారికి రావలసిన వాటా కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు అన్నారు. దీనిని జీర్ణించుకోలేక కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈడిని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని, ముందు దేశ సంపదను దోచుకుంటున్న బిజెపి నాయకులు, సంపన్నులకు కొమ్ముకాస్తున్న వారిపై కేసులు పెట్టాలేని డిమాండ్ చేశారు.

ఎన్ని కుట్రలు పన్నిన రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ అన్ని వర్గాల పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలులతో ముందుకు పోతున్నాం అన్నారుఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం,
ఈ ఐదు సంవత్సరాలే కాకుండా మళ్లీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం పతనం అవుతుందని దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్.. జిల్లా కలెక్టర్ సమావేశం..!

  3. Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!

  4. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!

  5. SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!

మరిన్ని వార్తలు