Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లావైద్యం

DMHO : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. రికార్డులను పరిశీలించిన DMHO..!

DMHO : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. రికార్డులను పరిశీలించిన DMHO..!

దంతాలపల్లి, మన సాక్షి :

మహబూబా బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మహబూబా బాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, స్టోర్ రూం, ఫార్మసీ రూమ్ ని తనిఖీ చేసి, వైద్య సిబ్బంది, రోగులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ,జాతీయ ప్రోగ్రాంల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల నమోదును తప్పకుండా చేయాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని ఉప కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్యులకు తెలిపారు.

రోగులకు సరిపడా మందులు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. గర్భిణీ స్త్రీల నమోదు రిజిస్టర్, ఈ డి డి రిజిస్టర్ పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు. అనంతరం నూతనంగా బాధ్యతలు తీసుకొని తొలిసారి ఆరోగ్య కేంద్రానికి వచ్చిన డీఎంహెచ్వో రవి రాథోడ్ ని వైద్య సిబ్బంది శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో డాక్టర్ చైతన్య,డాక్టర్ కవిత, సూపర్వైజర్స్ సుజాత, మంగమ్మ, బీమా స్టాఫ్ నర్స్ పద్మ, హెల్త్ అసిస్టెంట్ మిట్టకోల సత్యనారాయణ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

  2. Nalgonda : సంచలనం కలిగించిన కలర్ ల్యాబ్ యజమాని హత్య కేసును చేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్..!

  3. Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!

  4. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!

  5. SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!

మరిన్ని వార్తలు