Breaking Newsఅభివృద్దిజాతీయంజిల్లా వార్తలుతెలంగాణ

సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం

సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం

అభివృద్ధి, సంక్షేమ పథకాలు భేష్

స్వయం సంవృద్ధిలో ఏపూర్ అద్భుతం

సూర్యాపేట , మనసాక్షి :

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(యస్) మండలం ఏపూర్ గ్రామపంచాయతీ జాతీయస్థాయిలో మహిళా విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డు గెలుచుకోవడంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మకూరు(యస్) మండలంలోని ఏపూర్ గ్రామాన్ని సందర్శించి పలు పథకాలను పరిశీలించారు.

స్థానిక గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా విభాగంలో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి అవార్డు పొందడం , అవార్డు రావడానికి ఏ విధంగా కృషి చేశారని గ్రామ పాలకవర్గాన్ని అడగడం జరిగింది. దానికి సర్పంచ్ అలాగే పంచాయతీ కార్యదర్శి గ్రామంలో మహిళల కోసం చేసినటువంటి అభివృద్ధి పనులను అలాగే మహిళలు ఆర్థికంగా ఎలా స్వయం సమృద్ధి సాధించారో వారికి వివరించడం జరిగింది.

 

సంతులిత గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మహిళల సాధికారత ఆర్థిక స్వాలంబన, మహిళల యొక్క ఆరోగ్యం, రాజకీయ అవగాహన మొదలైన కార్యక్రమాలపై మహిళలకు గ్రామపంచాయతీ ద్వారా అవకాశాలను కల్పించామని గ్రామ సర్పంచ్ తెలియజేశారు .

అనంతరం గ్రామ వీధులలో తిరుగుతూ గ్రామంలోని మహిళా పార్క్, అంగన్వాడి సెంటర్, మహిళా వ్యాయామశాల, చిల్డ్రన్స్ పార్క్, హెల్త్ సబ్ సెంటర్, వైకుంఠధామం,నర్సరీ, సెగ్రీ గేషన్ షెడ్ చేపట్టిన పనులు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. గ్రామపంచాయతీ నర్సరీ , ప్రతి సంవత్సరం ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ ప్రక్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ALSO READ :

  1. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  2. BalaiahBabu : చంద్రబాబు అరెస్ట్ తో రంగంలోకి దిగిన బాలయ్య..!
  3. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

మా రాష్ట్రంలో కూడా పలు పథకాలు అమలుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఏపూర్ నందు బతకమ్మ ఘాట్ లో బృంద సభ్యులు మహిళలతో కలసి బతకమ్మ ఆడినారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నుండి జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచులు, ప్రజా ప్రతినిదులు జిల్లా పరిషత్ సి.ఈ. ఓ జి సురేష్ , జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య,

స్త్రీ శిశు సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, డివిజనల్ పంచాయతీ అధికారి వి సాంబి రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్సూర్ నాయక్, మహిళా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ , సర్పంచ్ సానబోయిన రజిత, మండల పంచాయత్ అధికారి సుధాకర్ , పంచాయతీ కార్యదర్శి ఉమా, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితర హాజరైనారు.

మరిన్ని వార్తలు