Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!

Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా తెలుగు రాష్ట్రాలలో బంగారు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉన్నందున బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ బంగారం ధర మాత్రం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం తులం బంగారం 91 వేల రూపాయలకు చేరింది. మరి కొద్ది రోజుల్లో లక్ష రూపాయలకు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాదులో 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు శుక్రవారం ఒక్కరోజే 14 వేల రూపాయలు పెరిగి 9,09,800 రూపాయలకు చేరింది. అదే విధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు10, 500 రూపాయలు పెరిగి 8,34,000 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే..?
హైదరాబాదులో మార్చి 28 శుక్రవారం (10 గ్రాముల) తులం బంగారం 24 క్యారెట్స్ 90,980 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 83,400 రూపాయలు ఉంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News :









