జాతీయంBreaking Newsవిద్య

SSC : పదవ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్.. పేరెంట్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్..!

SSC : పదవ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్.. పేరెంట్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

పదవ తరగతిలో ఫెయిల్ అవుతామనే భయంతో కొందరు, ఫెయిల్ అయ్యామని కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు చూసాము. తల్లిదండ్రులు తిడతారని, తిట్టారని, స్నేహితులు అవహేళన చేస్తారని ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము.

అయితే కర్ణాటకలో తమ కొడుకు పదవ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా పేరెంట్స్ చేసిన పనికి కచ్చితంగా ప్రతి ఒక్కరూ అవాక్కు కావాల్సిందే. తమ కొడుకు పదవ తరగతిలో ఫెయిల్ అయితే ఏమాత్రం తిట్టకుండా నిరుత్సాహపరచకుండా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని భాగల్కోటే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

కర్ణాటకలోని భాగల్కోటి జిల్లా నగరానికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. 625 మార్కులకు గాను 200 మార్కులు వచ్చాయి. దాంతో అతని ఫ్రెండ్స్ హేళన చేశారు. స్నేహితుల మాటలకు అభిషేక్ డీలపడ్డాడు. కొడుకు పరిస్థితిని గమనించిన పేరెంట్స్ ఏ మాత్రం ఆలోచించకుండా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.

పదవ తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని ఫెయిల్ అయినంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని, అభిషేక్ తల్లిదండ్రులు ధైర్యం కల్పించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిషేక్ పేరెంట్స్ చేసిన పనికి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెప్తున్నారు నేటిజన్స్. పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇకపై శ్రద్ధగా చదివి పరీక్షల్లో పాస్ అవుతానని అభిషేక్ పేర్కొంటున్నాడు.

MOST READ : 

  1. Weight Loss: బరువు తగ్గాలనే వారికి బెస్ట్ ఫుడ్..!

  2. Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

  3. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)

  4. NagarjunaSagar : నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజీ.. ఆయకట్టుకు కష్టాలు..!

  5. TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..! 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు