NagarjunaSagar : నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజీ.. ఆయకట్టుకు కష్టాలు..!
NagarjunaSagar : నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజీ.. ఆయకట్టుకు కష్టాలు..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి మరో మూడు అడుగుల దూరంలో ఉంది. గత ఏడాది భారీగా వర్షాలు కురిసి అనేక పర్యాయాలు నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తిన అధికారులు వేసవి సమీపించగానే నీరు పూర్తిగా ఎండిపోయింది.
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం సమయానికి 513. 90 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తికి, కుడి, ఎడమ కాలువలకు పూర్తిగా నీటిని నిలిపివేయగా ఎస్ఎల్బీసీ కాలువకు మాత్రం 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వాన కాలం సీజన్ నాటికి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. మళ్ళీ వర్షాలు పడితేనే ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం వేసవి సీజన్ లో కేవలం 7 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది.
సాగర్ లో నీటిమట్టం వివరాలు :
నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590, కనిష్ట నీటిమట్టం 510 అడుగులు.
ప్రస్తుతం 513.90 అడుగుల నీరు ఉంది.
ప్రస్తుతం 312.0450 టీఎంసీల నీటి నిలువకు గాను 138.3868 టీఎంసీల నీరు ఉన్నది. ఎస్ ఎల్ బి సి కి 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
-
GPay Loan : రెండు నిమిషాల్లో గూగుల్ పే రూ.12 లక్షల వరకు లోన్.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు..!
-
IPO : ఐపీవో బాటలో మరో కంపెనీ.. సెబీకి డీఆర్హెచ్పీ సమర్పించిన కరోనా రెమెడీస్ లిమిటెడ్..!
-
Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!









