Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఉద్యోగంతెలంగాణనారాయణపేట జిల్లా

Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం( రేపు ) నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాకు జిల్లాకు చెందిన చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న సూచించారు.

శుక్రవారం నారాయణపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులతో కలిసి తిప్పన్న మాట్లాడారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శనివారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.

మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, అశోక్, చామకూర నగేష్, ఉడ్మలగిద్ద అశోక్ తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)

  2. KFin: కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ఇక సులభం.. నూతన కేవైసీ సొల్యూషన్‌ ఆవిష్కరణ..!

  3. Diabetes : షుగర్ పేషంట్లు మామిడి పండ్లు తినొచ్చా..!

  4. Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

మరిన్ని వార్తలు