Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

GPay Loan : రెండు నిమిషాల్లో గూగుల్ పే రూ.12 లక్షల వరకు లోన్.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు..!

GPay Loan : రెండు నిమిషాల్లో గూగుల్ పే రూ.12 లక్షల వరకు లోన్.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు..!

మన సాక్షి, వెబ్ డేస్క్ :

గూగుల్ పే లావాదేవీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేపట్టడంతో పాటు బిల్లుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు సరికొత్తగా గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్ ఆప్షన్ కూడా వచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్లు, పత్రాలు లేకుండానే 30 వేల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పించింది. అది ఎలాగో తెలుసుకుందాం..

అవసరాల కోసం రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. బ్యాంకు వారు అడిగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయినా కూడా వారి అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం గూగుల్ పే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రుణ ప్రక్రియను పూర్తిగా ఆన్ లైన్ చేశాయి. గూగుల్ పే యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసిన వారి అంగీకారంతో ఖాతాలోకి డబ్బు వస్తుంది.

గూగుల్ పే అనేది google కంపెనీ అభివృద్ధి చేసిన డిజిటల్ వాలెట్. ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం దాని ద్వారా వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి డబ్బులు పంపడం, స్వీకరించడం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్థిక సేవలు వైపు కూడా విస్తరించింది. గూగుల్ పే, బ్యాంకులు NBFC లతో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.

ఎలాంటి పత్రాలు లేకుండానే మీ క్రెడిట్ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే 30 వేల రూపాయల నుంచి 12 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చును. వడ్డీ రేటు 11.1 శాతం నుండి ప్రారంభం కాగా ఉంటుంది. వడ్డీ రేటు కస్టమర్ క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తుదారులు కనీసం 21 సంవత్సరాలు నుండి ఉండాలి. వారికి ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం ఉండాలి. EMI రూపంలో నెలవారిగా బ్యాంకు ఖాతా నుండి రుణాన్ని తిరిగి జమ చేసుకుంటారు. రుణం చెల్లింపు చేయడంలో విఫలమైతే జరిమానాలు కూడా ఉంటాయి.

ఖాతాదారుని క్రెడిట్ స్కోరు ప్రభావితం కావచ్చు. ఈ రుణం కోసం అవసరమైన వివరాలను అందించి కేవైసీ పత్రాలను అప్లోడ్ చేయడంతో పాటు డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమోదం పొందగానే లోన్ మొత్తం నేరుగా వినియోగదారుల ఖాతాలో జమవుతాయి.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

  3. Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!

  4. Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు