Fake Dsp : నకిలీ డి.ఎస్.పి.. ఇదో పెద్ద కథ.. అరెస్టు చేసిన పోలీసులు..!

Fake Dsp : నకిలీ డి.ఎస్.పి.. ఇదో పెద్ద కథ.. అరెస్టు చేసిన పోలీసులు..!
మన సాక్షి, సూర్యాపేట :
ఏకంగా ఇతడు డబ్బు సంపాదన కోసం డిఎస్పి వేషం వేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువత నుంచి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నాడు. ఈ నకిలీ డిఎస్పి ని సూర్యాపేటలో సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల ప్రకారం.. ఉద్యోగాల పేరుతో నకిలీ డి.ఎస్.పి డబ్బులు వసూలు చేసి మోసగిస్తుండగా అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణంలోని శ్రీ గ్రాండ్ హోటల్లో ఒక అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు సూర్యాపేట జిల్లా మటంపల్లి కి చెందిన బత్తుల శ్రీనివాస్ గా గుర్తించారు. ఇతడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో డీఎస్పీగా పరిచయం చేసుకొని పోలీసు, పౌరసరఫరాల శాఖ, ఇంకా ఇతర శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు.
ఇతడు ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల నమోదైన కేసులలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చాడు. 2024 సెప్టెంబర్ నుంచి తిరిగి డిఎస్పీగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన మహిళకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ 36 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానంటూ గురజాల కు చెందిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆంధ్ర ప్రదేశ్ లోని మద్దూరు కు చెందిన యువకుడు నుంచి డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని పట్టుకొని 18 లక్షల రూపాయలు కారు, పోలీస్ యూనిఫామ్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్టు ఎస్పీ తెలిపారు.
MOST READ :
-
Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
-
TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!










