Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

బిల్లులు రాక రైతులు ఆందోళన..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం పాడి రైతులు బిఎంసి మేనేజర్ మమత గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

బిల్లులు రాక రైతులు ఆందోళన..!

వెల్దండ, ( మనసాక్షి) :

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం పాడి రైతులు బిఎంసి మేనేజర్ మమత గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో ఉన్నటువంటి విజయ పాల సెంటర్ల లో బిల్లులు సకాలం లో రావడం లేదని మరియు బిఎంసి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ కరెక్టుగా లేదని మరియు ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వెల్దండ సొసైటీ మొత్తం లావాదేవీలలో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీలైనంత తొందరగా చర్య తీసుకోవాలని బిఎంసి మేనేజర్ మమత గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడి రైతులు యన్నం విజేందర్ రెడ్డి, గోసుల సాయిలు, చలిచీమల నిరంజన్, సిర్సనగండ్ల శేఖర్, యన్నం రాజేందర్ రెడ్డి, అన్నెపు ప్రశాంత్, రఘుమా రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

By : Ramanjaneyulu, veldanda

MOST READ : 

  1. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  2. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు