క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!

Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!
షాద్ నగర్, మన సాక్షి :
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టింది. పట్టణానికి చెందిన మచ్చందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు.
రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోను అక్కడే ఉంటున్న వ్యక్తికి ఇచ్చి తన వాళ్ళకు ఫోన్ చేయాలని ప్రాధేయపడటం కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచ్చేంద్ర తన కూతురును శంషాబాద్ వర్దమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MOST READ :
-
TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!
-
Khammam : ఖమ్మం జిల్లాలో నాటు తుపాకుల కలకలం.. తుపాకులు స్వాధీనం..!
-
Nalgonda : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..!
-
ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!
-
PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!









