తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : 28న గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్..!

District collector : 28న గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఓటర్ జాబితా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేస్తున్నట్లు తెలిపారు. భార్యాభర్తలు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల13న డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టరోల్ రోల్స్ గ్రామ పంచాయతీ లలో నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

19న అన్ని రాజకీయ పార్టీలతో మండల్ లెవెల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న డిస్పా్జాల్ అఫ్ ఆబ్జెక్షన్స్, 28న ఫైనల్ పబ్లికేషన్ అఫ్ ఫోటో ఎలక్టరల్ రోల్స్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయాలలో ఓటర్ జాబితాను అందజేశామని వాటి పరిశీలన అనంతరం చివరిగా జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ లో 12 వార్డులు ఉండగా ఒక కుటుంబం ఒకే దగ్గర ఆ జాబితాలో లేదని రాజకీయ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా తయారయ్యే జాబితా తమకు ఇవ్వాలని ప్రతినిధులు కోరారు.

ఈ సమావేశంలో ఆర్. డి. ఓ. మధు మోహన్, డి. ఆర్. డి. ఎ. మొఘలాప్ప, డి. పి. ఓ. కృష్ణ, డి. యల్. పి. ఓ. సుదర్శన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నుండి ఎండి సలీం, ఎంఐఎం నుండిఎండి తాహీర్, బి. జె. పి. టౌన్ ప్రెసిడెంట్ బి. వెంకటయ్య,సిపిఐ బాలరాము, టిఆర్ఎస్ అలీ షైక్,సిపిఎంఎల్ కే నారాయణ, సిపిఎం గోపాల్, టిడిపి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Nalgonda : సారీ ఫ్రెండ్స్, సారీ టీచర్స్.. ఏ తప్పు చేయలేదు..  మిస్సింగ్ విద్యార్థుల లేఖ సోషల్ మీడియాలో వైరల్..!

Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..! 

Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. ఫుడ్ కోర్టుకు భారీ జరిమానా..!

పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా.. రజాకార్లను తరిమి కొట్టిన మల్లారెడ్డి గూడెం ప్రజలు..!

 

మరిన్ని వార్తలు