పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా.. రజాకార్లను తరిమి కొట్టిన మల్లారెడ్డి గూడెం ప్రజలు..!
పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా.. రజాకార్లను తరిమి కొట్టిన మల్లారెడ్డి గూడెం ప్రజలు..!
సూర్యాపేట, మనసాక్షి
పోరాటాలకు పురిటి గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా అని రాష్ట్ర బి. సి కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.తదుపరి జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్బంగా బి సి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజా స్వామ్య వ్యవస్థ ఆవిర్బవానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ , రైతాంగ పోరాట యోధులకు అలాగే స్వాతంత్ర్య సమర యోధులకు జోహర్లు అని అన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు కీలకమైన రోజు. నిజాం రాజ్య నుండి భారత్ దేశంలో వీలనమై 76 సం. లు పూర్తి చేసుకొని 77 సం. లోకి అడుగుపెడుతున్న శుభ సందర్బంగా హాజరైన ప్రజా ప్రతి నిధులకు,జిల్లా న్యాయ మూర్తులు, అధికారులు,
అనధికారులు,పాత్రికేయులకు, కర్షక, కార్మిక,ఉద్యమ కారులకు, విద్యార్థిని విద్యార్డులకు,జిల్లా ప్రజలందరికి శుభాకాంక్షలు. నేటి ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావటానికి ఎంతో మంది ఈ గడ్డ మీద ప్రాణ త్యాగాలు చేశారు.ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధి కి నాంది. దేశమంతా 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంతుంటే హైదరాబాద్ సంస్థానం ప్రజలు మాత్రం స్వేచ్చ, స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉన్నారు.
1920 వరకు ఎలాంటి నిజాం రాజ్యం లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు లేవు. నిజాం రాజ్యం స్వతంత్ర్యంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు.కానీ సంస్థానంలోని భూస్వాములు, జామిందార్లు, జాగిర్దార్లు, దేశముఖ్ లు ప్రజలను వేదించారు.రైతుల చేతికి వచ్చిన పంటను దోచుకోవటం, స్థానిక భాషను అణిచివేయటం, వెట్టిచాకిరీ, బానిసత్వం,రజాకార్ల దమనకాండ కొనసాగింది.
నిజాం రాజ్యం లో కనీస హక్కుల కోసం పోరాడిన వారిని, దౌర్జన్యలను ఎదురించిన వారిపై దాడులు ఎక్కువ కావటంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలు చైతన్యవoతులు కావటంలో ముఖ్య కారణం గ్రంధాలయ ఉద్యమం.1901 లో మొదటి గ్రంధాలయం శ్రీ కృష్ణ భాష నిలయాన్ని మునగాల రాజా నాయని వెంకట రంగారావు స్థాపించారు. 1904 లక్ష్మణరావు కృషి తో హన్మకొండ లో నరేంద్ర భాష నిలయాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం గ్రంధాలయం మహా సభలు జరుపుతూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు.
1933 నుండి 1946 వరకు 13 ఆంధ్ర మహాసభలు జరిగి తెలంగాణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర పోషించాయి.ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో నల్గొండ ప్రజల పోరాట ఫటిమ కీలకమైనది.
నల్గొండ జిల్లా నుండి బి నరసింహారెడ్డి, బి ధర్మబిక్షం, ఆరుట్ల రామ చంద్ర రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి.. మొదలగు వారు ఎందరో తెలంగాణ త్యాగధానులు తెలంగాణ ఉద్యమాని ప్రభావితం చేశారు.రాచరిక వ్యవస్థ కు జరిగిన పోరాటం లో మొదటి సారి అనువులు బాసిన దొడ్డి కొమరయ్య స్ఫూర్తి తో ఉద్యమం తీవ్రతరమైనదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా జడ్పీ సీఈఓ వి అప్పారావు ఆర్డీవో వేణుమాధవ్ డి ఎఫ్ ఓ సతీష్ కుమార్ తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి డిటిడిఓ శంకర్ డిఇఓ అశోక్ ఎస్సీ అభివృద్ధి అధికారి లత బిసి అభివృద్ధి అధికారి అనసూయ కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్ రెడ్డి డిపిఓ కే నారాయణ రెడ్డి డిడబ్ల్యుఓ నర్సింగరావు డివైస్ ఓ రామచంద్రరావు సిపిఓ ఎల్ కిషన్ అధికారులు ప్రజా ప్రతినిధులు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!
Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!










