మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
మాడ్గులపల్లి, (మనసాక్షి) :
తల్లి తండ్రులు మందలించారని డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన బొబ్బలీ సైదులు కుమార్తె బొబ్బలీ రమ్య నల్గొండ ఎన్ జీ కళాశాలలో బీ జెడ్ సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది.
కొన్ని రోజుల నుంచి సరిగా చదవడం లేదని ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై మంగళవారం రోజు ఇంటో ఎవరు లేని సమయం లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన వెంటనే హైద్రాబాద్ కామినేని హాస్పిటల్ కు తరలించారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరిక్షలు నిర్వహించి మృతురాలి తండ్రి పిర్యధు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అప్పగించినట్లు మడ్గులపల్లి ఎస్ ఐ నరేష్ తెలిపారు.










