Breaking NewsTOP STORIESక్రైంహైదరాబాద్

సికింద్రాబాదులో కాల్పులు, ఒకరి మృతి, పలువురికి గాయాలు

సికింద్రాబాదులో కాల్పులు, ఒకరి మృతి,

పలువురికి గాయాలు

సికింద్రాబాద్, మనసాక్షి : రద్దు చేసిన ఆర్మీ పరీక్షలు తిరిగి నిర్వహించాలని, అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. కాగా రైల్వే స్టేషన్లో రైలు తగలబెట్టడం, రైల్వే స్టేషన్ పూర్తిగా ధ్వంసం చేయడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఒక యువకుడికి ఛాతి లోకి బుల్లెట్ దిగడంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు ఇచ్చారు. ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆందోళన లో గాయపడిన పలువురు యువకులను సైతం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతుంది. ఒక ఆందోళనకారుడికి వెన్ను విరిగింది. అతనికి చికిత్స అందిస్తున్నారు . గాయపడిన వారిలో లక్ష్మారెడ్డి, విద్యాసాగర్, చంద్రు, రమేష్, వినయ్, మహేష్, నాగేంద్రబాబు. ఉన్నట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి : 

1. BREAKING : తెలంగాణకు వ్యాపించిన అగ్నిపథ్ మంటలు

2. మిర్యాల” మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం అయ్యేనా..?, జాప్యానికి రిజర్వేషన్లే కారణమా?

3. దామరచర్ల లో పది రోజుల క్రితం వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి

మరిన్ని వార్తలు