Nalgonda : గుర్రంపోడు మండలంలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం..!

Nalgonda : గుర్రంపోడు మండలంలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం..!
గుర్రంపోడు,, మన సాక్షి:
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
మండలంలోని వివిధ గ్రామాల నేతలు, పెద్దలు చర్చించుకుని, గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఏకగ్రీవాలకు మొగ్గు చూపారు. దీంతో ఎన్నికల కోలాహలం, పోటీ వాతావరణం నెలకొనాల్సిన ఈ ఐదు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.
1.ముల్కలపల్లి సర్పంచిగా బొడ్డుపల్లి లింగస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2.ఎల్లమోనిగూడం సర్పంచి అభ్యర్థిగా వాడపల్లి వెంకన్న ఏకగ్రీవమయ్యారు.
3.కట్టవారిగూడెం సర్పంచిగా చాడ ప్రమీల చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
4.బుడ్డ రెడ్డిగూడెం సర్పంచి అభ్యర్థిగా సింగం బాలకృష్ణ ఏకగ్రీవమయ్యారు.
5 మైలాపురం సర్పంచి అభ్యర్థిగా కట్టా వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, ఈ ఐదుగురు అభ్యర్థులు ఏకైక పోటీదారులుగా మిగిలారు. దీంతో అధికారులు వారి ఎన్నికను ధ్రువీకరించి, ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ ఏకగ్రీవాలతో మండలంలో ఎన్నికల వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. మిగిలిన పంచాయతీలకు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
MOST READ
-
CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!
-
INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..!
-
TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!
-
SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!
-
Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!









