Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking Newsతెలంగాణహైదరాబాద్

CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అన్న అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్బంగా వారు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.

ప్రముఖ నటులు చిరంజీవితో పాటు రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నటులు జెనీలియా దేశ్‌ముఖ్, అక్కినేని అమల, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండేతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.

స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని వారితో ముఖ్యమంత్రి చెప్పారు.

ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

MOST READ : 

  1. ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!

  2. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  3. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

  4. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

మరిన్ని వార్తలు