Nagarjunasagar : రెండేళ్ల అనంతరం సాగర్ కు వరద.. 515 అడుగులకు చేరిన నీటిమట్టం, 4,5 రోజుల్లో కాలువలకు నీరు.. Latest Update
Nagarjunasagar : రెండేళ్ల అనంతరం సాగర్ కు వరద.. 515 అడుగులకు చేరిన నీటిమట్టం, 4,5 రోజుల్లో కాలువలకు నీరు.. Latest Update
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద చేరుతుంది. రెండేళ్ల అనంతరం జలాశయానికి నీరు చేరుతుంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయం నీరు అడుగంటింది. దాంతో సాగునీటితో పాటు తాగునీటికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు మూడు గేట్లు ఎత్తడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది.
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 1,42,141 క్యూసెక్కుల నీరు చేరుతుంది. సాగర్ జలాశ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 141 టీఎంసీలు ఉంది.
వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున మరో 4,5 రోజుల్లో సాగర్ కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో 3.30 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల పథకాల కింద మరో 80 వేల ఎకరాలు, ఎస్ఎల్బీసీ ద్వారా 2.5 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద :
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరదరావడంతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా వారి వరద చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 3,29,038 క్యూసెక్కుల నీరు దిక్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 4,69,906 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
ఇవి కూడా చదవండి :
Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!









