Doctorate : చేవెళ్ళ యువతికి అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్..!

Doctorate : చేవెళ్ళ యువతికి అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లవాడ అనుబంధ గ్రామమైన జాలగూడ కు చెందిన యువతి వ్యవసాయ శాస్త్రంలో అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకుంది.
అతెల్లి రవీందర్ రెడ్డి, అనిత దంపతుల కుమార్తె అక్షర పదో తరగతి వరకు చేవెళ్లలోని సత్యసాయి గ్రామర్ హైస్కూల్లో చదువుకుంది. హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేసి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది.
ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో మాస్టర్ చేసేందుకు అమెరికాలోని లూథియానా యూనివర్సిటీలో చేరింది. అక్కడ అగ్రికల్చర్ ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఫ్లోరిడా యూనివర్సిటీలో పిహెచ్ డి లో చేరిన యువతి దాదాపు నాలుగేళ్లు కష్టపడి డాక్టరేట్ సాధించింది. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!









