Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్లినా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తుంది. అందుకు గాను మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఫ్రీ టికెట్ ను కండక్టర్ అందజేస్తున్నారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కానీ ఇటీవల కండక్టర్లకు మహిళలకు అనేక సందర్భాలలో వివాదాలు తలెత్తుతున్న విషయం కూడా తెలిసిందే. ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, అడ్రస్ తప్పు ఉందని కండక్టర్లు జీరో టికెట్ కొట్టడానికి నిరాకరిస్తున్నారు. దాంతో మహిళలు వారితో వివాదాలకు దిగుతున్నారు. ఇంతకాలం పాటు జీరో టికెట్ పై ప్రయాణం చేసిన మహిళలు ఆధార్ కార్డు అప్డేట్ లేదని జీరో టికెట్ ఇవ్వనని కండక్టర్లు చెప్పడంతో గొడవలు జరుగుతున్నాయి.

ఆధార్ కార్డులు ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో అందజేసినవి ఉన్నాయి. వాటిని చాలా మంది అప్డేట్ చేసుకోలేదు. అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. దాంతో పాటు గతంలో ఆధార్ కార్డు ఇచ్చిన సమయంలో ఫోటో ఉండడంతో గుర్తించలేని స్థితిలో ఉండటం వల్ల కండక్టర్లు జీరో టికెట్ అందజేయడం లేదు.

ఈ సందర్భంగా వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకునే మహిళలు మహాలక్ష్మి టికెట్ పొందాలంటే ఆధార్ కార్డులో అప్డేట్ ఫోటో మరియు తెలంగాణ రాష్ట్ర చిరునామా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నది. కచ్చితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కండక్టర్ కు సహకరించాలని అప్పుడు టికెట్ అందజేస్తారని ఆర్టీసీ పేర్కొన్నది.

ఇదిలా ఉండగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఆధార్ కార్డు లోని అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్లో చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఫోటో, బయోమెట్రిక్ అప్డేట్ కావాలంటే ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే పది సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. ఇకపై ఆధార్ అప్డేట్ లేకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలి అనుకునే వారికి జీరో టికెట్ ఇక కష్టమే.

MOST READ : 

  1. Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!

  2. District collector : భోజనం ఎలా ఉంది.. స్నాక్స్ లో ఎం ఇస్తారు.. విద్యార్థులతో జిల్లా కలెక్టర్..!

  3. Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

  4. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

  5. Holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా సెలవులే సెలవులు..!

మరిన్ని వార్తలు