Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

పిల్లల భవిష్యత్తు కోసం.. వారి చదువులకు, వివాహాలకు డబ్బు కొరత లేకుండా చూడాలని తల్లిదండ్రులు భావిస్తారు. అందుకుగాను వివిధ రకాల పొదుపు స్కీములతో పాటు పెట్టుబడుల పథకాలలో కూడా చేరుతుంటారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. అందుకు పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన అనే గొప్ప ఆప్షన్ తీసుకొచ్చింది.

సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి..?

భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని నిర్వహిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన పొదుపు స్కీం. కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. అయితే ఈ ఖాతాను కుమార్తె పేరు మీద తెరవాలి. కానీ అమ్మాయి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఈ ఖాతాలో ప్రతి సంవత్సరం కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చును.

రూ. 70 లక్షలు ఎలా వస్తాయి..?

పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ పథకం ద్వారా 70 లక్షల రూపాయలు పొందవచ్చనే విషయం అందరికీ తెలియదు. అయితే మీ కుమార్తె 21 ఏళ్ల వయసులో 70 లక్షల రూపాయలు పొందాలనుకుంటే మీరు ప్రతి నెల 12,500 రూపాయలను ఆదా చేసి సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ముందుగా మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయసులో మీరు ఈ ఖాతాను తెరవాలి.

ఈ ఖాతాలు తెరిచి వరుసగా 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1.5 లక్షల రూపాయలు జమ చేయాలి. ఈ విధంగా 15 సంవత్సరాలలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 22.5 లక్షల రూపాయలు అవుతుంది. అయితే ఈ స్కీం చక్రవడ్డీ అందిస్తుంది. 21 సంవత్సరాల తర్వాత మీ మొత్తం దాదాపు 69.27 లక్షల రూపాయలను వడ్డీ ద్వారా అందజేస్తుంది.

అయితే ఈ స్కీములో ప్రత్యేకమైనది ఏమిటంటే..? వచ్చే వడ్డీ పూర్తిగా పనులు రహితం. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 8.2% ఉంది. మీ కుమార్తెకు 18 సంవత్సరాల వయసు నిండినప్పుడు మీరు పాక్షిక ఉపసంహరణ కూడా చేసుకోవచ్చును. విద్యా ఖర్చులకు గాను కొంత డబ్బును తీసుకునే అవకాశం ఉంది. పూర్తి డబ్బు మాత్రం 21 సంవత్సరాలు పూర్తయినప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి.

MOSY READ : 

  1. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

  2. Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!

  3. Holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా సెలవులే సెలవులు..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!

 

మరిన్ని వార్తలు