తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు.. సూర్యాపేట వాసికి ఆహ్వానం..!

Suryapet : ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు.. సూర్యాపేట వాసికి ఆహ్వానం..!

సూర్యాపేట, మనసాక్షి :

ఆగస్టు 15 న ఢిల్లీ లోని ఎర్రకోటలో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనాల్సిందిగా సూర్యాపేట పట్టణానికి చెందిన జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి గూడూరు నాగేశ్వర్ రావుకి కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండవ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ లో తెలంగాణ నుండి పాల్గొనినాగేశ్వర్ రావు పథకాలు పొంది ఘనత సాధించినందుకు గాను ప్రత్యేక ఆహ్వానం పొందారు.

ఈ ఆహ్వానం 2025 ఏప్రిల్ లో ఢిల్లీలో జరిగిన సెకండ్ ఏషియన్ యోగాసనా స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల యోగాసన ప్లేయర్స్ కు వచ్చిందన్నారు. మన తెలంగాణ నుండి గూడూరు నాగేశ్వరరావు ఒక్కరికే రావటం తెలంగాణకు, సూర్యాపేటకు గర్వకారణ మన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో అవార్డులు, పథకాలు సాదించాలని పలువురు ఆకాంక్షించారు..

ఈ సందర్బంగా సూర్యాపేట కు మంచి పేరు తెచ్చిన నాగేశ్వర్ రావ్ కు సూర్యాపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తీకుళ్ళ సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు వందనపు శ్రీదేవి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రావు కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి :

  1. BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!

  2. Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

  4. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

మరిన్ని వార్తలు