Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 72 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాలరకాల యంత్రంగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆయన హైదరాబాదు లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో భారీ వర్షాల సూచన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులు, సిబ్బంది ప్రజలు రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడానికి వీలు లేదని చెప్పారు.

అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి తక్షణమే సెలవులన్నింటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్షాల సందర్భంగా తక్షణ సమాచారం కోసం అన్ని జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ను ముందే గుర్తించి అక్కడి నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైనచోట సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు తాగునీరు, వసతి, భోజనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని కంట్రోల్ రూమ్ లను అప్రమత్తం చేసి 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు విపత్తు పరిస్థితులలో వారి వద్ద ఉండే విపత్తు నిర్వహణ నిధులను వినియోగించాలని, ప్రజలకు సహాయం చేయడానికి వెనకాడవద్దని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్తు అంతరాయం ఏర్పడినా, ట్రాన్స్ఫార్మర్స్, లైన్లు పనిచేయకపోయినా తక్షణమే పునరుద్ధరించేలా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలన్నారు.

తాగునీటికి ఇబ్బంది లేకుండా తాగునీటి శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక వర్షపాతం కురిసేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లా కలెక్టర్లు ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకుగాను ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

వైద్య ఆరోగ్యశాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మందులు, చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీస్ క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎఫ్ఎం రేడియో ద్వారా అలెర్ట్ లు ఇవ్వాలని, టీవీ, మీడియా ద్వారా సమన్వయం చేసుకోవాలన్నారు.

ఎవరైనా ప్రజలను భయపెట్టే తప్పుడు వార్తలు రాస్తే తగు చర్య తీసుకునే విధంగా ఉండాలని, అంతేకాక సరైన సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు అందించేలా చూడాలని సమాచార శాఖను ఆదేశించారు .నీటిపారుదల శాఖ ఆయా ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో సమాచారం ఇవ్వాలన్నారు. సాధ్యమైనంతవరకు ప్రజలు భారీ వర్షాలలో ఇండ్ల నుండి బయటికి రాకుండా ఉండాలని కోరారు.

అవసరమైతే పాఠశాలలు, కళాశాలలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే విధంగా విద్యాశాఖ తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుండే పని చేసే విధంగా చూడాలన్నారు. ఎన్టీఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలని అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేసి విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ కు సిద్ధం చేసుకోవాలన్నారు.

అన్ని జిల్లాలలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారుల కాజ్ వే ల వద్ద ప్రమాదాలు జరగకుండా హోంగార్డులను ,బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు .పొంగి ప్రవహించే వాగులు, వంకలు, లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ఎవరు దాటే ప్రయత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తెగడానికి ఆస్కారం ఉన్న చెరువులు, కుంటల ను ముందే గుర్తించి తక్షణమే వాటిని పటిష్టం చేయాలని తెలిపారు. కుండపోతగా కురిసే వర్షాన్ని సైతం తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రానున్న 48 గంటలు, 72 గంటలు, అలాగే ఈ నెల 18వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో కురిసేందుకు అవకాశం ఉన్న వర్షపాతం, వాతావరణ శాఖ హెచ్చరికలను వివరించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, డిజిపి జితేందర్, తదితరులు మాట్లాడారు.

MOST READ : 

  1. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  2. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

  3. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  4. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  5. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

మరిన్ని వార్తలు