Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా
BREAKING : లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ తరలింపు..!
BREAKING : లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ తరలింపు..!
మన సాక్షి, హైదరాబాద్ :
రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన వికారాబాద్ జిల్లా లగచర్ల లో జరిగిన ఘటనలో కొడంగల్ బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మార్నింగ్ వాక్ లో ఉండగా ఫిల్మ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన పోలీసులు ఆయనను వికారాబాద్ కు తరలించారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ మాట్లాడినట్లు సమాచారం. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. లగచర్ల ఘటనకు పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేశారనే ఆరోపణలలో ఆయనను విచారణ జరుపుతున్నారు.
లగచర్ల ఘటనలో ఇప్పటివరకు 59 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 16 మందికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
MOST READ :
-
Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)
-
Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు.. జిల్లా వ్యాప్తంగా చర్చ..!
-
Family Survey : మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..? సర్వే అంతా కోడ్ లోనే..!
-
Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!









