Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

TG News : మాజీ పోలీస్ కమిషనర్ భూమికే ఎసరు.. ఫోర్జరీ అగ్రిమెంట్‌ కాగితాలతో 57 ఎకరాలు అమ్మేందుకు యత్నం.!

TG News : మాజీ పోలీస్ కమిషనర్ భూమికే ఎసరు.. ఫోర్జరీ అగ్రిమెంట్‌ కాగితాలతో 57 ఎకరాలు అమ్మేందుకు యత్నం.!

రూ. 22.80 కోట్లకు హైద్రాబాద్‌ వ్యక్తితో ఒప్పందం…

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న…

వివరాలను వెళ్లడించిన జోగిపేట సీఐ

అందోలుః, మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా అందోలు గ్రామానికి చెందిన సైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషనర్‌తో పాటు ఆయన కుటుంబీకులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు కొందరూ కేటుగాళ్లు యత్నించిన ఘటన జోగిపేట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని చోటుచేసుకుంది. ఈ ఘనటకు సంబందించి బుధవారం జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరాలను తెలియజేశారు.

అందోలు గ్రామానికి చెందిన రిటైర్డు ఐపీఎస్‌ అధికారి శేరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబీకులు అంజమ్మ, నర్సింహరెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి అందోలు శివారులో ఉంది. వీరికి సంబందించిన ఈ భూమిని ఎకరాకు రూ.39 లక్షల చోప్పున రూ.22.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు నారాయణఖేడ్‌ నియోజకవర్గం పరిధిలోని ర్యాకల్‌ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్‌ తాండాకు చెందిన రవీందర్‌లు అనే ముగ్గురు వ్యక్తులు 57 ఎకరాలకు సంబందించి నకిలీ అగ్రిమెంట్‌ డాక్యూమెంట్లను సృష్టించారు.

ALSO READ  : Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!

ఈ భూమిని హైద్రాబాద్‌కు చెందిన యాదగిరి రెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఆయన వద్ద నుంచి రూ.11 లక్షలు టోకెన్‌ అమౌంట్‌ కింద చెక్కును తీసుకున్నారు. నెల రోజుల తర్వాత యాదగిరి రెడ్డి భూమిని రిజిష్ట్రేషన్‌ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో యాదగిరి రెడ్డి అందోలు గ్రామంలోని మాజీ ఐపిఎస్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి వాళ్ల బంధువుల భూమి వద్దకు వచ్చి ఆరా తీయగా ఈ భూమిని తాము ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరి రెడ్డి ఖంగుతిన్నారు.

తాను భూమిని కొనుగోలు చేసేందుకు రూ.11 లక్షలను నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డికి ఇచ్చినట్లు వారికి తెలిపారు. సంజీవరెడ్డి ఇచ్చిన డాక్యూమెంట్‌లను వారికి చూపించగా, ఈ విషయాన్ని రిటైర్ట్‌ ఐపీఎస్‌ ప్రభాకర్‌రెడ్డికి కుటుంబికులు తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే సంగారెడ్డి జిల్లా ఐపీఎస్‌ రూపేష్‌కు పిర్యాదు చేశారు.

జోగిపేట సీఐ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దీంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ అగ్రిమెంట్‌ పత్రాలు సష్టించి తమ భూమిని కాజేయలని యత్నించిన వారిపై నర్సింహరెడ్డి జోగిపేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్‌లపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపించినట్లు జోగిపేట సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి :

BREAKING : భూ సమస్యలు, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

SIM Cards New Rules : జస్ట్ వన్ మినిట్.. మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. లేదంటే రెండు లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష..!

మరిన్ని వార్తలు