Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BREAKING : భూ సమస్యలు, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

BREAKING : భూ సమస్యలు, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

భూ సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి వాటిని పరిష్కరించాలని శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. అనంతరం ఉద్యోగుల రిజిస్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులంతా సమయపాలన పాటించాలని ఉదయం 9:30 గంటల కు ప్రతి ఒక్కరు ఆఫీసులో ఉండాలని అన్నారు. భూ సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి వాటి సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయ భవనాన్ని సందర్శించారు.

ఇవి కూడా చదవండి : 

Miryalaguda : నేను, నా మిర్యాలగూడ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమం..!

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!

BREAKING: మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ విస్తృత తనిఖీలు.. ఉద్యోగుల పై ఆగ్రహం..!

మరిన్ని వార్తలు