BREAKING: మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ విస్తృత తనిఖీలు.. ఉద్యోగుల పై ఆగ్రహం..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సంబంధిత అధికారులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

BREAKING: మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ విస్తృత తనిఖీలు.. ఉద్యోగుల పై ఆగ్రహం..!

పనితీరు బాగా లేకుంటే చర్యలు తప్పవు

విద్యార్థులకు నాణ్యత లేని అల్పాహారం

సంబంధిత సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ పై ఫైర్

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సంబంధిత అధికారులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఎంఈఓ బాలాజీ నాయక్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.

హాస్టల్లో విద్యార్థులకు అల్పాహారం నాణ్యత లేకుండా పెడుతున్నారని హాస్టల్ సిబ్బంది, ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు పెట్టే అల్పాహారం లిస్టు, ఉపయోగించే వస్తువుల లిస్ట్ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడంతో దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

వెంటనే శుభ్రపరచి ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రేర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయుల పై ఆగ్రహించారు. ఇలా చేస్తే ఉపాధ్యాయులకు చర్యలు తప్పవని హెచ్చరించారు.విద్యార్థులు విద్యను నేర్చుకొని తల్లిదండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలున్నా నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు.

ALSO READ :

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

Batti, Revanth : వైయస్సార్ జయంతి వేడుకల్లో బట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి అలా స్పందించారు..!