Miryalaguda : నేను, నా మిర్యాలగూడ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమం..!

నేను.. నా మిర్యాలగూడ పేరుతో మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Miryalaguda : నేను, నా మిర్యాలగూడ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నేను.. నా మిర్యాలగూడ పేరుతో మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) సరికొత్త స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని మిర్యాలగూడ పట్టణంలో చేపడుతారు. గతంలో ఎవరూ చేపట్టని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దటమే ఆయన లక్ష్యం. చేయి చేయి కలుపుదాం.. మిర్యాలగూడ పారిశుద్ధ్యం మెరుగుపరుద్దాం.. అనే ఆయన ఈ నినాదంతో రాబోతున్నారు.

స్వచ్ఛ మిర్యాలగూడ కోసం ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) మాస్టర్ ప్లాన్ చేశారు. మిర్యాలగూడలో డ్రైనేజీ సమస్య లేకుండా ఆయన లక్ష్యం. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే ఈ చర్యలకు చేపట్టారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలు వస్తే దోమలు పెరిగిపోయి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మిర్యాలగూడ పట్టణంలో నాలుగు రోజులపాటు రోజుకు 12 వార్డుల చొప్పున స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరో అదనంగా పదిమంది పారిశుద్ధ్య కార్మికులను కేటాయించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొని స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకే ప్రారంభించనున్నారు. నాలుగు రోజులపాటు ఈనెల 14వ తేదీ వరకు పట్టణంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని పారిశుధ్యం మెరుగుపరచాల్సిందిగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి : 

Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!

GreenTea : గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని లాభాలా.. అవేంటో తెలుసుకుందాం..!

Ration Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!