Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డిహైదరాబాద్

Ganesh Shobhayathra : మొదలైన గణేష్ శోభాయాత్ర.. 450 రూపాయలతో మొదలై 24 లక్షలకు చేరిన వేలం పాట.. అందరి దృష్టి లడ్డువేలం పాటపై ..!

Ganesh Shobhayathra : మొదలైన గణేష్ శోభాయాత్ర.. 450 రూపాయలతో మొదలై 24 లక్షలకు చేరిన వేలం పాట.. అందరి దృష్టి లడ్డువేలం పాటపై ..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్‌లో గణేష్‌ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

లడ్డు వేలం పాట పైనే అందరి దృష్టి లడ్డు వేలం పాట పైనే అందరి దృష్టి ఉంటుంది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తారు 450 రూపాయల వేలంపాటతో మొదలైన లడ్డు వేలంపాట 24 లక్షలకు చేరింది. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాట కేవలం 450 రూపాయలు మాత్రమే.

ALSO READ : Khairathabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. శోభాయాత్ర ప్రారంభం ఎప్పుడంటే..!

కరోనా సమయంలో తప్ప 28 ఏళ్లపాటు ఈ వేలంపాట సాగుతూనే ఉంది. రికార్డ్ స్థాయిలో లడ్డు ధర పలుకుతూ కొన్న వారి కొంగు బంగారు గా నిలుస్తుంది. సుమారు 20 మంది స్థానికులు స్థానికేతరులు ఆ మధ్య జరిగే ఈ వేలంపాట పూట పోటీగా సాగుతుంది.

గత ఏడాది వేలంపాటలో 24 .60 లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2021 లో బాలాపూర్ లడ్డు 18 లక్షలు పలికింది. 2022లో 5.70 లక్షలు మాత్రమే పలికింది.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు