Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణపండుగలుహైదరాబాద్

Khairathabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. శోభాయాత్ర ప్రారంభం ఎప్పుడంటే..!

Khairathabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. శోభాయాత్ర ప్రారంభం ఎప్పుడంటే..!

హైదరాబాద్ , మనసాక్షి :

వినాయక చవితి పండుగ వచ్చిందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఖైరతాబాద్ గణేశుడు గుర్తుకు వస్తాడు. అత్యంత వైభవంగా వినాయక చవితి పండుగను జరిపే ప్రాంతాల్లో ఖైరతాబాద్ ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చును.

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కూడా అత్యంత వైభవంగా జరగనున్నది. ఖైరతాబాద్ లో గణేశుడి నిమజ్జనం గురువారం జరగనున్నది. గురువారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానున్నది. కాగా బుధవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు.

భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం కోసం 40000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాలను హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ పరిశీలించారు .

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

ఎం జె మార్కెట్ సమీపంలోని కన్వర్జేన్స్ పాయింట్ వద్ద సమిష్టిగా పనిచేయాలని సిపి ఆనంద్ జోనల్ డిసిపిలను ఆదేశించారు. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ మార్గంలో చంద్రాయన గుట్ట ,చార్మినార్, నయాపూల్, ఎం జె మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, పీపుల్స్ ప్లాజా వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

చార్మినార్ ,తెలుగు తల్లి ఫ్లై ఓవర్ సమీపంలోని ప్రాథమిక ఊరేగింపుల మార్గాలను పరిశీలించారు. విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలను వాటి ఎత్తుకు తగినట్టుగా స్పష్టమైన సూచనలను పాటించాలని సూచించారు. విగ్రహాల ఎత్తు పరిమితులను ధ్రువీకరించడం.. తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను గుర్తించి అడ్డంకులను తొలగించటం, ఊరేగింపుకు ఆటంకం కలిగించే అడ్డంకులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు .

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో 25,694 మంది సిబ్బందితో పాటు 125 ప్లాట్లూన్ మోహరించాలని చెప్పారు. ఎంజీ మార్కెట్ , అఫ్జల్గంజ్, అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ లాంటి 18 ముఖ్యమైన జంక్షన్ లలో అధికారులకు షిఫ్ట్ విధానంలో డ్యూటీలు ప్లాన్ చేశారు. మూడు RAF కంపెనీలు ఇతర పారామీలటరీ దళాలు చేరుకున్నాయి.

ఐదు డ్రోన్ బృందాలను రంగంలోకి దించారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాలు నిమజ్జనం చేసే ప్రదేశాల్లోనూ సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. ఊరేగింపులో సాధారణ ట్రాఫిక్ అనుమతించరని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

మరిన్ని వార్తలు