TOP STORIESBreaking Newsతెలంగాణ
Gold Price : ఉన్నట్లుండి సడన్ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే కొండెక్కిన పసిడి..!
పసిడి ప్రియులకు ఒకేసారి ధరలు షాక్ తినిపించాయి. గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర బుధవారం ఒక్కరోజే భారీగా పెరిగింది.

Gold Price : ఉన్నట్లుండి సడన్ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే కొండెక్కిన పసిడి..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు ఒకేసారి ధరలు షాక్ తినిపించాయి. గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర బుధవారం ఒక్కరోజే భారీగా పెరిగింది. పెరిగిన ధరలతో మహిళలు కంగు తిన్నారు. లక్ష రూపాయలకు చేరువ అవుతుందని ధరలు ఇంకా తగ్గుతాయని భావించిన మహిళలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 37,600 పెరిగింది. 22 క్యారెట్ కు 34,500 రూపాయలు పెరిగింది.
ఈరోజు తులం ఎంతంటే..?
బుధవారం 10 గ్రాముల తులం బంగారం ధర హైదరాబాదులో ఎంత ఉందంటే..? 3760 రూపాయలు పెరిగి 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల (తులం)కు 1,46,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 3450 1,34,450కు చేరింది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.









