BREAKING : మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక..!
BREAKING : మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక..!
న్యూఢిల్లీ , మనసాక్షి :
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకు ఒకరు చొప్పున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతో ఆ పార్టీ అధినేత కేసిఆర్ సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నేత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు.
కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. లోకసభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ మున్షి, పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, మధు యాష్కి తదితరులు ఉన్నారు.
ALSO READ :









