Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు కూడా కృష్ణ బేసిన్ లో వర్షాలు.. వరదలు లేకపోవడంతో కృష్ణ ప్రాజెక్టులన్నీ వేలవెలబోతున్నాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడకపోవడం వల్ల కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీ లోనే ఉన్నాయి.

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

మన సాక్షి : వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు కూడా కృష్ణ బేసిన్ లో వర్షాలు.. వరదలు లేకపోవడంతో కృష్ణ ప్రాజెక్టులన్నీ వేలవెలబోతున్నాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడకపోవడం వల్ల కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీ లోనే ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు మొదలుకొని నాగార్జునసాగర్ రిజర్వాయర్ వరకు కూడా నీరు లేక వెలవెల బోతున్నాయి.

ప్రతి ఏటా కూడా ఆగస్టు మాసంలో భారీ వర్షాలు పడి ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుంది. కానీ గత ఏడాది నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం నీటి కోసం ఎదురుచూసి పంటల సాగు చేసుకోలేకపోయారు. అంతేకాకుండా ఉన్న కాస్త నీటిని తాగునీటికి ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. మే నెలలో ఉన్న కాస్త నీటిని కూడా తాగునీటి కోసం విడుదల చేశారు.

ALSO READ : Telangana Govt : సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఇక ఆన్ లైన్ ద్వారానే.. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

జూలై మాసంలో వర్షాలు పడకపోతే సాగునీటి సంగతే కాకుండా తాగునీటి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రానున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాది నుంచి పంటల సాగు లేక కృష్ణ ప్రాజెక్టులలో నీరు వస్తుందా..? రాదా..? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల బోర్లు, బావుల ఆధారం ఉన్న రైతులు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకు వరినారులు సైతం పోసుకున్నారు. తెలంగాణలో కృష్ణ బేసిన్ ప్రాజెక్టులలో పరిధిలో 35 లక్షల ఎకరాల వరి సాగు కానున్నది. గత ఏడాది వర్షాలు లేని కారణంగా పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది.

ప్రాజెక్టులలో నీటి వివరాలు :

కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులలో నీటినిలువల వివరాలు ఇలా ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టులో 129.72 టీఎంసీలకు గాను కేవలం 35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తుంగభద్ర లో 105.79ఎంసిలకు గాను 5.28 టీఎంసీలు, నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గాను 25 టీఎంసీలు, జూరాలలో 9.66 ఎంసీలకు 7.97 ఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకు గాను, 37.45 టీఎంసీలు, నాగార్జునసాగర్ రిజర్వాయర్లో 312.05 టీఎంసీలకు గాను 122. 03 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది.

ఎదురుచూస్తున్న రైతులు :

ఇప్పటివరకు కూడా కృష్ణ బేసిన్ లో వర్షాలు వరదలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లని డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ వరకు కూడా నీటి నిల్వలు అడుగంటిపోయాయి. అన్ని ప్రాజెక్టులు నిండేందుకు సుమారుగా ఇంకా 650 టీఎంసీల నీరు అవసరం ఉంది. జూలై, ఆగస్టు మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే జలకళ సంతరించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా వర్షాలు పడకపోవడంతో రైతన్నలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

ALSO READ : 

BREAKING : కార్యాలయాల్లో బుధ, గురువారాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

TGSPDCL : టీజీఎస్పీడీసీఎల్ సంచలన నిర్ణయం.. కరెంట్ బిల్లులు అలా చెల్లిస్తే చెల్లవు.. ఇకపై ఇలా చెల్లించాలి..!