Telangana Govt : సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఇక ఆన్ లైన్ ద్వారానే.. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి సహాయనిధి పథకంలో తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పారదర్శకత ప్రాధాన్యంగా అర్హులైన పేదలందరికీ ముఖ్య మంత్రి సహాయనిధి పథకం అందేలా చర్యలు చేపట్టింది.

Telangana Govt : సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఇక ఆన్ లైన్ ద్వారానే.. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్, మన సాక్షి :

ముఖ్యమంత్రి సహాయనిధి పథకంలో తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పారదర్శకత ప్రాధాన్యంగా అర్హులైన పేదలందరికీ ముఖ్య మంత్రి సహాయనిధి పథకం అందేలా చర్యలు చేపట్టింది. అందుకుగాను సీఎంఆర్ దరఖాస్తులన్నీ ఇక ఆన్ లైన్ లోనే చేయాలని నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులు తమ వద్దకు వచ్చే సీఎంఆర్ దరఖాస్తులకు సిఫార్సు లేక జతచేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంది.

అందుకుగాను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన వెబ్ సైట్ cmrf.telangana.gov.in ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత ప్రాధాన్యతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అందేలా ఉండేందుకుగాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : 

BREAKING : కార్యాలయాల్లో బుధ, గురువారాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

TGSPDCL : టీజీఎస్పీడీసీఎల్ సంచలన నిర్ణయం.. కరెంట్ బిల్లులు అలా చెల్లిస్తే చెల్లవు.. ఇకపై ఇలా చెల్లించాలి..!