TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో తెలియజేసింది. రెండు లక్షల రూపాయల పంట రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేస్తున్న ప్రభుత్వం మరో శుభవార్త తెలియజేసింది. రుణమాఫీలో భాగంగా మొదటి విడత లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను ఈ నెల 18వ తేదీన రైతుల ఖాతాలలో జమ చేస్తూ మాఫీ చేసింది.

రెండవ విడత రుణమాఫీ ఈనెలాఖరులోగా చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీలోగా మూడవ విడత రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అదే విధంగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే ఆయా బ్యాంకులలో పంట రుణాలు తీసుకోవచ్చునని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణమాఫీ పొందిన రైతులు వారి వారి ఖాతాలకు వచ్చిన డబ్బులను చెక్ చేసుకుని బ్యాంకులో అధికారులను కలిసి వెంటనే కొత్త రుణాలను తీసుకోవచ్చునని పేర్కొన్నారు.

బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన బ్యాంకులను ఆదేశించారు.

దాంతో రైతులు రుణమాఫీ పొందడంతో పాటు కొత్త రుణాలు తీసుకొని అవకాశం ఉంది. ప్రస్తుతం వానకాలం సీజన్ రావడంతో రైతులకు కొత్తగా పంట రుణాలు ఇవ్వడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Godavari Flood Warning : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, నిలిచిన రాకపోకలు..!

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Komatireddy Venkatreddy : మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల పూర్తి.. ఎస్ఎల్బీసీకి రూ.2200 కోట్లు మంజూరు..! 

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

మరిన్ని వార్తలు