Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Komatireddy Venkatreddy : మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల పూర్తి.. ఎస్ఎల్బీసీకి రూ.2200 కోట్లు మంజూరు..! 

Komatireddy Venkatreddy : మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల పూర్తి.. ఎస్ఎల్బీసీకి రూ.2200 కోట్లు మంజూరు..! 

నల్లగొండ, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రజలు,నల్గొండ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలనీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం గోపాలాయ పల్లి శ్రీవారి జాల వేణుగోపాలస్వామి ఆలయంలో సంవత్సరంలోపు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఆయత చండీయాగం జరిపిస్తాం అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డిఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ సుదర్శన యాగ సహిత రుద్ర యాగం” లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చినాటికి బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్ బిసీ సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 2200 కోట్ల రూపాయల ను మంజూరు చేయించడమే కాకుండా, నిదుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.

పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అందరూ బాగున్నప్పుడే దేశం, రాష్ట్రం బాగుంటాయని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఇందులో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఆగస్టు మొదటి వారంలో లక్షన్నర రూపాయల లోపు రైతులకు రుణమాఫీ వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. 32 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ చేస్తున్నామని, అన్నదాతలు సుఖంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు.

ALSO READ: BREAKING : హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. రోజుకో అధికారి సస్పెండ్, వ్యవసాయ శాఖ ఏవో సస్పెండ్

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇటీవలే డీఎస్సీ పరీక్షలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో 2 కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు.

చెరువుగట్టుల్లో 100 కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా వారిగజాల శ్రీ వేణుగోపాలస్వామి గుడి పైకి వచ్చే రహదారిని ఆర్ అండ్ బి శాఖ ద్వారా రెన్యువల్ చేయిస్తానని మంత్రి తెలిపారు. ప్రజలందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని, తాము అన్ని మతాలను గౌరవిస్తామని అన్నారు.సంవత్సరంలోపు శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

హైదరాబాద్ -విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి అంగీకరించడం జరిగిందని వచ్చే నెలలో ఈ రహదారి పనులకు టెండర్లు పిలువనున్నట్లు మంత్రి వెల్లడించారు.
నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వరరావు, డిఎస్పి శివరాంరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ,తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి : 

Komatireddy Venkatreddy : రుణమాఫీ పై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. లక్షన్నర రుణమాఫీ పై స్పష్టం..! 

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

Good News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డి మరో కొత్త పథకం..!

మరిన్ని వార్తలు