Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం లో భాగంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నది. ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు వంటలు సాగు చేసిన రైతులకు రైతు భరోసా ద్వారా ఖాతాలలో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 1.50 లక్రల మంది రైతులకు కూడా రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసింది.
మూడు ఎకరాల పైన ఉన్న రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. అందుకుగాను ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మూడు ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి రైతు భరోసా పథకానికి గాను 18 వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో అందరికీ అర్హులైన వారందరికీ రైతు భరోసా అందనున్నది.
Latest News :
-
వడగండ్ల వానతో అపార నష్టం.. నేలరాలిన మామిడి, పడిపోయిన వరి..!
-
BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!
-
TG News : మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య.. ఓ విద్యార్థి సమాధానం..!
-
WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది.. ఇక లొకేషన్ షేరింగ్..!
-
BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకున్న బీఓఐ..!









