Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది.. ఇక లొకేషన్ షేరింగ్..!

WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది.. ఇక లొకేషన్ షేరింగ్..!

మన సాక్షి :

కోట్లాదిమంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సప్. మనదేశంలో అత్యధిక మంది వాట్సప్ యాప్ ను వినియోగిస్తున్నారు. చాలా ఈజీగా ఫోటోలు, వీడియోలు, సమాచారం చేరవేసుకునే అవకాశం వాట్సప్ లో ఉంది. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లో తీసుకొస్తుంది. యూజర్లకు అనుకూలంగా ఉండే విధంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఇటీవల వాట్సప్ స్టేటస్ లో మ్యూజిక్ ఆప్షన్ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే దాంతోపాటు ఇటీవల వాట్సప్ స్టేటస్ కు సంబంధించిన మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ లో లొకేషన్ షేరింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు వాట్సప్ స్టేటస్ లోను లొకేషన్ షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది.

అందుకోసం ఏం చేయాలంటే వాట్సప్ ఓపెన్ చేసి అప్డేట్ ట్యాబ్ కి వెళ్లాలి. యాప్ కెమెరాతో ఫోటో క్యాప్చర్ చేయాలి. అందుకోసం గ్యాలరీలోని ఫోటో కానీ వీడియో కూడా యాడ్ చేయవచ్చును.

ఆ తర్వాత స్క్రీన్ పై భాగంలో ఉన్న స్టిక్కర్ ఐకాన్ పై టాప్ చేయాలి. దాంతో క్లాక్ ఐకాన్ పక్కన లోకేషన్ స్టిక్కర్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేసి లొకేషన్ సెర్చ్ చేయాలి. లొకేషన్ ఎంచుకున్న తర్వాత దానిని ట్యాగ్ చేయాలి. ఓన్లీ లొకేషన్ షేర్ చేయడమే కాకుండా లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయవచ్చును.

Similar News : 

WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు