Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

ACB : ఏసీబీ వలకు చిక్కిన యువజన క్రీడా అధికారి..!

క్యాటరింగ్ బిల్లులను ప్రాసెస్ చేసి చెక్కులు ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటున్న జిల్లా యువజన మరియు క్రీడా శాఖకు చెందిన ఇద్దరు గురువారం ఏసీబీ చిక్కారు.

ACB : ఏసీబీ వలకు చిక్కిన యువజన క్రీడా అధికారి..!

( మహబూబ్‌నగర్ జిల్లా – గోపాల్ )

క్యాటరింగ్ బిల్లులను ప్రాసెస్ చేసి చెక్కులు ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటున్న జిల్లా యువజన మరియు క్రీడా శాఖకు చెందిన ఇద్దరు గురువారం ఏసీబీ చిక్కారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏఓ.జె.రాజశేఖర్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా అధికారి బివై.ఎస్ ఏఓ .జి.ఉమేష్, కంప్యూటర్ ఆపరేటర్,జిల్లా యువజన క్రీడా అధికారులు పట్టుబడ్డారు ఫిర్యాదు దారుడికి సంబంధించిన క్యాటరింగ్ బిల్లులను పరిష్కరించి చెక్కులు మంజూరు చేయడానికి నిందితులు రూ.1,00,000. రూపాయలు) డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

గురువారం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ బృందం దాడి నిర్వహించి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఇద్దరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ అధికారి సిహెచ్ బాలకృష్ణ,ఏసీబీ డి.ఎస్.పి, తెలిపారు.

మరిన్ని వార్తలు